Wednesday, October 4, 2023

అదుపుత‌ప్పి బోల్తాప‌డిన కారు -న‌లుగురు మృతి-ముగ్గురికి తీవ్ర గాయాలు

ప్ర‌మాద‌వ‌శాత్తు ఓ కారు అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి చెందారు. ఆక‌గా మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌లో జరిగింది. బుధవారం వేగంగా వెళ్తున్న కారు ముక్పాల్‌ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ఉన్నారని, మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement