Friday, October 4, 2024

TG: బస్సు టైర్ పేలి.. 24మందికి గాయాలు..

జనగామ కలెక్టరేట్, సెప్టెంబర్ 30 (ప్రభ న్యూస్) : జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ‌ ఉదయం బెంగళూరు నుంచి వరంగల్ కు ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ప్రైవేట్ లగ్జరీ బస్ వెళ్తుండగా బస్ టైర్ పేలడంతో అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, 23 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

బస్ రన్నింగ్ లో టైర్ పేలడంతోనే అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం. క్షత‌గాత్రులను జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ – భూపాలపట్నం జాతీయ రహదారిపై ప్రమాదం సంభవించడంతో సుమారు కిలోమీటర్ మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. బస్ లో ఇరుక్కుపోయిన ఒకరిని జేసీబీ సహాయంతో బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

\

Advertisement

తాజా వార్తలు

Advertisement