Saturday, December 7, 2024

WGL | ఎల్లారెడ్డిగూడెంలో దారుణహత్య

రఘునాథపల్లి, నవంబర్ 14 (ఆంధ్రప్రభ) : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో గురువారం అర్ధరాత్రి దారుణ హత్య చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అదే గ్రామానికి చెందిన గంపల పరుశురాములు(40) పర్వత మహేందర్ ల మ‌ధ్య‌ బుధవారం రాత్రి గొడవ జరిగిందని, ఈగొడవలో మహేందర్ కొడవలితో పరశురాములు తలపై కొట్టి అతి కిరాతకంగా హత్య చేశాడు.

మహేందర్ పరుశురాములుకు కొంత డబ్బు అప్పుగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈవిషయంలో గొడవ జరిగినట్లు అనుమానిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిందితుడు మహేందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. హత్య జరిగిన‌ సమాచారం అందుకున్న జనగామ రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, రఘునాథపల్లి ఎస్సై నరేష్ యాదవ్ లు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement