Saturday, October 12, 2024

HYD: కాంగ్రెస్‌లో చేరిన బిఆర్టియు ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ ఉప్పల శ్రవణ్ కుమార్ గుప్తా

కర్మన్ ఘాట్, నవంబర్ 20 (ప్రభ న్యూస్) ఎల్ బి నగర్ నియోజకవర్గ బిఆర్టియు ఇంఛార్జ్ ఉప్పల శ్రవణ్ కుమార్ గుప్తా, రాష్ట్ర కార్యదర్శి మహేష్ దేశ్పాక్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం చంపాపేట డివిజన్ శుభోదయం కాలనీ ప్రాంతంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న మధు యాష్కి గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, జెక్కిడి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో 30 మందితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరికీ సముషిత స్థానం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆర్ వాగ్దానాలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన వాటన్నిటిని అమలు పరుస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యమకారులకు తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు. ఉప్పల శ్రవణ్ కుమార్ గుప్త మాట్లాడుతూ బి ఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమము జరిగినప్పటి నుండి పనిచేసిన వారికి స్థానం లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు 250 గజాల స్థలము 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి 25 వేల రూపాయలు పెన్షన్ ఇస్తుందని ప్రకటించినందున తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో నెల్లుట్ల శేఖర్, శ్రీనివాస్ గౌడ్ ,గడ్డి మల్ల వెళ్ళిందర్, వెంకటేష్ ,సముద్రాల వెంకటేశ్వర్ల గుప్తా, గోపేష్ గుప్తాతో పాటు కాంగ్రెస్ నాయకులు డివిజన్ అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి ,గోపాల్ ముదిరాజ్‌ ,అనసూయ గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement