Thursday, April 25, 2024

తెలంగాణ‌లో సుసాధ్యం .. దేశంలోనూ చేసి చూపిస్తాం – కెసిఆర్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దేశ భవిష్యత్తు మార్చే దిశగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ప్రస్థానం ప్రారంభమైందని బీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దేశంలో గుణాత్మక మార్పును తీసుకువచ్చి మహాభారత్‌ ఆవిష్కరిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌ తెలంగాణభవన్‌లో గులాబీ దళపతి సమక్షంలో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌ దంపతులు, కోరా పుట్‌ మాజీ ఎంపీ జయరామ్‌ పాంగి, అక్షయ్‌కుమార్‌ పలువురు మాజీ ఎమ్మెల్యే లు, జిల్లా పరిషత్‌ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ… ఒడిశా నుంచి వచ్చిన వారందరినీ చూస్తే తనకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లనిపిస్తోందన్నారు. ఈ మహా యుద్ధంలో, మహోద్య మంలో పాల్గొనడానికి వచ్చిన వారికి ఈ సందర్భంగా సీఎం ధన్య వాదాలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ను చూసి కొందరు ఎగతాళి చేస్తున్నా రని, పర్వాలేదు.. చేసుకోనీయండన్నారు. వాళ్ల దగ్గర డబ్బుంటే, తమ వద్ద నీతి, న్యాయం ఉందన్నారు. ఎవరికీ భయపడేది లేదని, జైళ్లో వేస్తే వేసుకోమనండి.. ఏమవుతుంది
అని సీఎం ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రతిసారి పార్టీలు, నేతలు గెలిచి ప్రజల ఓడిపోతున్నారన్నారు. ఈ పరిస్థితి మార్చాల్సిందేనని పిలుపునిచ్చారు.

ఎన్నికల్లో ప్రజలు గెలిచినపుడే నిజమైన ప్రజాస్వామ్యం వచ్చినట్లని, ఈ దిశగా బీఆర్‌ఎస్‌ మార్పు తీసుకువస్తుందని చెప్పారు. అమెరికా, చైనా కంటే దేశంలో ఎక్కువ వనరులున్నాయని, కానీ వాటిని వాడుకునే శక్తి లేకుండా పోయిందన్నారు. మనకంటే ఆల స్యంగా స్వాతంత్రం వచ్చిన దేశాలు కూడా మనకంటే ముం దున్నాయన్నారు. స్వాతంత్రం వచ్చిన 75ఏళ్ల తర్వాత కూడా సాగుకు, తాగడానికి నీళ్లివ్వలేని దుస్థితి ఉందన్నారు. ఎంతో మంది పెద్ద నేతలు వచ్చి ఎన్నో ఉపన్యాసాలిచ్చారని, 75 ఏళ్ల తర్వాత కూడా రైతులు, పేదలు పరిస్థితి మాత్రం మారలె దన్నారు. దేశంలో ప్రస్తుతం సోషలైజేషన్‌ ఆఫ్‌ లాసెస్‌, ప్రైవె టేజేషన్‌ ఆఫ్‌ ప్రాఫిట్స్‌ అనే విధంగా పరిస్థితి ఉందన్నారు. నష్టాలొస్తే ప్రజలపై భారం వేయడానికి, లాభాలొచ్చే కంపెనీ లను మాత్రం అదానీ, అంబానీలకు అమ్ముతున్నారన్నారు.. ఒడిశాలోని మహానదిలో అవసరానికంటే ఎక్కువగా నీళ్లు న్నాయని, ప్రస్తుతం కేవలం 25శాతం నీళ్లను మాత్రమే వాడు కుంటున్నారన్నారు.

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్‌, కిసాన్‌ బంధు
దేశంలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశ మంతా రైతాంగానికి ఉచిత విద్యుత్‌ ఇస్తామని, రెండేళ్లలో దేశంలో మూలమూలన 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. దేశమంతా రైతులకు కిసాన్‌ బంధు పేరుతో ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతు బంధు ఇస్తామని, దేశమంతా రైతు బంధు అమలు చేస్తామని చెప్పారు. ఇంటిం టికి తాగేందుకు స్వచ్ఛమైన నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో అమెరికా, చైనా కంటే ఎక్కువగా సాగులో ఉన్న భూ మి ఉందని, పనిచేసేందుకు కావాల్సిన మానవవనరులు, నీరు ఉన్నపుడు రైతు పరిస్థితి ఇలా ఎందుకు ఉండాలన్నారు. రైతులకు తగినంత ధర దొరకడం లేదన్నారు. వజ్ర సంక ల్పంతో పోరాడితే రైతుల పరిస్థితి మార్చవచ్చన్నారు. స్వా తంత్రం వచ్చి ఇన్నేళ్లయినా ఆదివాసులు, దళితుల పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. తెలంగాణలో మాత్రం ప్రతి దళిత కుటుంబానికి ఎలాంటి షరతు లేకుండా ఏదైనా వ్యా పారం చేసుకోవడానికి రూ.10 లక్షలు ఇస్తున్నామని చెప్పారు.

అందుకే అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌…
దేశ యువత నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతోందని కేసీ ఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు సమస్యలున్నాయని ఏకం గా 13 నెలలు పోరాడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికీ వారికి ఎలాంటి ఉపశమనం దొరక లేదు. దేశంలో ప్రతి ఒక్క వర్గం పరిస్థితి ఇలానే ఉందన్నారు. దేశంలో ప్రజలతో మజాక్‌ చేసే పరిస్థితి ఉందన్నారు. అందుకే బీఆర్‌ఎస్‌ పార్టీ అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనే నినాదమి చ్చామన్నారు. రైతులు ఎన్నికల్లో గెలిస్తే నీళ్లెందుకు రావో చూద్దామన్నారు. 8 ఏళ్ల క్రితం తెలంగాణలో ఎన్నో కష్టాలు పడ్డామని, మనసు పెట్టి పనిచేసి ప్రస్తుతం చాలా సమస్యలకు పరిష్కారాలు వచ్చాయన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మ హత్యలు ఆగాయన్నారు. వలస వెళ్లిన వారు తిరిగి వచ్చారని చెప్పారు. మహారాష్ట్ర, ఒడిశాలో, మొత్తం దేశంలో ఈ మా ర్పు ఎందుకు రాదని ప్రశ్నించారు. ధన్‌ కీ బాత్‌ కాదని, ఇది మన్‌ కీ బాత్‌ అన్నారు. మనసు పెట్టి పనిచేస్తే సాధ్యమవు తుం దన్నారు.

- Advertisement -

డిశాలో బొగ్గు దొరుకుతుంది… విద్యుత్‌ ఉండదు…
ఒడిశాలో మంచి నాణ్యమైన బొగ్గు దొరుకుతుందని, విద్యుత్‌ మాత్రం నిరంతరం ఎందుకుండదని కేసీఆర్‌ ప్రశ్నిం చారు. దేశంలో 4 లక్షల మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ ఉందని, కానీ దీనిలో కేవలం రెండున్నర లక్షల మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే వినియోగిస్తున్నారన్నారు. దేశంలో వనరులున్నా యని, సంపద ఉన్నాయని, సరిగా వాడుకోవడం లేదనడానికి ఇదే నిదర్శనమన్నారు. వనరులను వినియోగించుకుని దేశం లోని ప్రస్తుత పరిస్థితిని మార్చడానికే బీఆర్‌ఎస్‌ ఆవిర్బ éవించిందన్నారు. చివరగా జై భారత్‌ అని కేసీఆర్‌ తన ప్రసం గాన్ని ముగించారు.

ఒడిషా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌తో పాటు శుక్రవారం తెలంగాణ భవన్‌లో భారీ సంఖ్యలో నాయకులు భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌)లో చేరారు. గిరిధర్‌ వెంట ఆయన భార్య హేమ గమాంగ్‌, ఒడిశా బీజేపీ రాష్ట్ర యువ మోర్చా ప్రధాన కార్యదర్శి స్నేహ రంజన్‌ దాస్‌, కొరాపుట్‌ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ యువత అధ్య క్షులు, ఏఐసీసీ సభ్యులు రబీంద్ర మొహపాత్ర, ఫల్గుణి సబర్‌, పి. గోపాల్‌ రావు, మల్యా రంజన్‌ స్వెయిన్‌, నవనిర్మాణ కిశాన్‌ సంఘటన్‌ కన్వీనర్‌ అక్షయ్‌ కుమార్‌, మయూర్‌ భంజ్‌ మాజీ ఎంపీ, ఎమ్మెల్యే రాంచంద్ర హన్సడా, దైన్‌ కనాల్‌ మాజీ ఎమ్మెల్యే నబిన్‌ నందా, బండారి ఫొఖ్రి, భద్రక్‌ మాజీ ఎమ్మెల్యే రతాదాస్‌, బింజార్పూర్‌, జాజ్పూర్‌ మాజీ ఎమ్మెల్యే అర్జున్‌ దా స్‌, బలిపట్నా ఖర్ధా మాజీ ఎమ్మెల్యే దేవాశిష్‌ నాయక్‌, జన తాదళ్‌ సోన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే దేవ్‌రాజ్‌ భారీ సంఖ్యలో జిల్లాస్థాయి నాయకులు, న్యాయవాదులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, భారీ సంఖ్యలో బీఆర్‌ ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement