Thursday, November 14, 2024

Peerzadiguda : బీఆర్ఎస్ కు చేజారిన మ‌రో కార్పొరేష‌న్

మేడిపల్లి, ఆగస్టు 9 (ప్రభ న్యూస్) : బీఆర్ఎస్ కు మ‌రో కార్పొరేష‌న్ చేజారింది. పీర్జాదిగూడ‌ కార్పొరేషన్ లో 26మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇటీవల డిప్యూటీ మేయర్ తో సహా 20మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా కార్పొరేటర్లు మేయర్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కీసర ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి సమక్షంలో 21మంది కార్పొరేటర్లు మేయర్ కు వ్యతిరేకంగా అవిశ్వాసాన్ని ఆమోదించుకోవడం జరిగింది. ఈ అవిశ్వాస ఆమోదంతో జక్క వెంకట్ రెడ్డి ఈరోజు నుంచి మాజీ మేయర్ గా కొనసాగనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement