Friday, January 21, 2022

వదిననే కొట్టి చంపిన మరిది

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో దారుణం జరిగింది. వదిననే కొట్టి చంపాడు ఓ మరిది. ఈ సంఘటన దేవరకద్ర మండల పరిధిలోని చిన్న రాజమూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చిన్న రాజమూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు తాగుడుకు బానిసగా మారాడు. దీంతో ఆయన వదని లక్ష్మీ తన పిల్లలను తీసుకెళ్లింది. దీంతో తన సంసారానికి అడ్డు అవుతుందనే ఉద్దేశంతో ఆంజనేయులు వదినే లక్ష్మిని కర్రతో కొట్టి చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News