Thursday, March 28, 2024

Breaking : కుప్ప కూలిన.. నిర్మాణంలో ఉన్న మూడు అంత‌స్తుల భ‌వనం

నిర్మాణంలో ఉన్న భ‌వ‌నం కూలింది. దాంతో శిథిలాల కింద ఇద్ద‌రు చిక్కుకున్న‌ట్లు స‌మాచారం. ఈ సంఘ‌ట‌న హైదరాబాదులోని కూకట్ పల్లిలో చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఒక్కసారిగా బయటకి పరిగెత్తారు. మూడవ అంతస్తులు స్లాబ్ వేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే స్లాబ్ కింద ఎవరైనా ఉన్నారేమోనని అనుమానిస్తున్నారు స్థానికులు. విషయం తెలుసుకున్న మునిసిపల్ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement