Tuesday, December 10, 2024

Breaking News పట్టాలు తప్పిన గూడ్స్ రైలు .. రాకపోకలకు తీవ్ర అంతరాయం

పెద్దపల్లి, ఆంధ్రప్రభ గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోవులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం రాత్రి గజియాబాద్ నుండి కాజీపేట వైపు ఐరన్ కాయల్స్ తీసుకు వెళుతున్న గూడ్స్ రైలు పెద్దపల్లి జిల్లా రాఘవపూర్, కన్నాల మధ్యలో పట్టాలు తప్పి ఆరు భోగీలు పట్టాలపై పడిపోయాయి.

దీంతో ఢిల్లీ, చెన్నై ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ఎటువైపు రైలు అటువైపు నిలిచిపోయాయి. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లతోపాటు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలు ఎక్కడికక్కడ పట్టాలపై నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు.

గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై పడిపోవడం వల్ల వాటిని తొలగించేందుకు సమయం పడుతుందని బుధవారం ఉదయం వరకు రైళ్ల రాకపోకలు కొనసాగే అవకాశం లేదని అధికారులు తెలియజేశారు. ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement