Wednesday, March 27, 2024

Breaking: నిజామాబాద్ ఎమ్మెల్సీగా క‌విత ఏక‌గ్రీవం..

నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ను ఏక‌గ్రీవంగా ప్ర‌క‌టించారు. ఈ ఎన్నిక‌లో బీజేపీ పోటీ చేయ‌బోమ‌ని ప్ర‌క‌టించింది. ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిని నిల‌బెడుతున్న‌ట్టు చెప్పినా.. చివ‌రి నిమిషంలో త‌న ఆలోచ‌న మార్చుకుంది. అయితే.. ఎంపీటీసీ భ‌ర్త‌.. ఎంపీటీసీల సంఘం ప్ర‌తినిధి శ్రీ‌నివాస్ ఇండిపెండెంట్‌గా నామినేష‌న్ దాఖ‌లు చేయ‌డంతో ఇక్క‌డ ఎన్నిక జ‌రుగుతుంద‌ని అంతా భావించారు.

కానీ, కొంత‌మంది ‘‘త‌మ సంత‌కాల‌ను పోర్జ‌రీ చేసి శ్రీ‌నివాస్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు’’ అని క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేయ‌డంతో శ్రీ‌నివాస్ నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యింది. దీంతో సీఎం కేసీఆర్ త‌న‌య‌, క‌ల్వంకుంట్ల క‌విత ఒక్క‌రే నామినేష‌న్ ప‌రిశీల‌న‌లో ఉండ‌డంతో ఏక‌గ్రీవంగా ఎన్నికయిన‌ట్టు ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ప్ర‌క‌టించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement