Thursday, March 28, 2024

వ్యాట్ ను త‌గ్గించాల‌ని బీజేపీ ధ‌ర్నా

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు బాషా పిలుపుమేరకు పెట్రోల్, డీజిల్ పై ఉన్న వ్యాట్ ను వెంటనే తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎస్సీ సెల్ కన్వీనర్ దాసి నాగరాజు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేప‌ట్టారు. ఈ కార్యక్రమం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హనుమాన్ టెంపుల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేప‌ట్టారు. సంక్షేమం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలని..పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను వెంటనే తగ్గించాలని.. నినాదాలు చేస్తూ ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్లి మహనీయులకు నివాళుల‌ర్పించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ దాసి నాగరాజు మాట్లాడుతూ… దేశంలో ప్రజల సంక్షేమం పట్ల భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి కలిగి ప్రజా ప్రయోజనకరమైన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల సంక్షేమం పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని.. నియంతృత్వ పోకడలకు పోతూ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాన్ని కేసీఆర్ నెర‌వేర్చ‌లేదన్నారు. ముఖ్యంగా దళితులను అడుగడుగునా మోసం చేస్తూ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఏదో ఒక అబద్ధాలు చెప్పి లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు. అందులో భాగంగానే హుజురాబాద్ ఎన్నిక‌ల్లో దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి మళ్లీ దళితులను మోసం చేశారన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజ‌రైన రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ మర్చిపోయి రాచరిక వ్యవస్థ కొనసాగిస్తూ.. ఆయన ఒక రాజు లాగా వ్యవహరిస్తున్నాడన్నారు. ప్రతి ప్రెస్ మీట్ లోనూ అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అన్ని రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ పై ఉన్న వ్యాట్ ను తగ్గిస్తే తెలంగాణలో ఎందుకు తగ్గించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు రామచంద్ర నాయక్, సేవా హి సంఘటన్ జిల్లా కో కన్వీనర్ సుమన్, దళిత మోర్చా ఉపాధ్యక్షులు కొంకి రాము, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ యువ మోర్చా అధ్యక్షుడు రవీంద్ర, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు కుమార్ గౌడ్, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మహిళా నాయకురాలు ఉష రాణి, అనిత, కిసాన్ మోర్చా నాయకులు శివ, సీనియర్ నాయకులు డాక్టర్ ఎంఎస్.రాజు, రెడ్డి, శంకర్, రామారావు, పదుల సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement