Wednesday, April 24, 2024

తెలంగాణలో కాషాయ జెండా ఎగరేద్దాం..

బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యం
బండి సంజయ్ కు అగ్రనేతల ప్రశంసల జల్లు
పలుమార్లు ప్రజా సంగ్రామ యాత్ర ప్రస్తావన
2024 సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లపై ధీమా
ముగిసిన జాతీయ కార్యవర్గ సమావేశాలు
దేవుళ్లతో వ్యాపారమా: కేటీఆర్‌పై సంజయ్ ఫైర్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దిశానిర్దేశం జరిగింది. తెలంగాణతో పాటు- ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాలపై కమలనాథులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే బెంగాల్‌, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీకి వాతావరణం అత్యంత సానుకూలంగా ఆ పార్టీ అగ్రనేతల్లో ఒకరైన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్య మని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం న్యూఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమా వేశాల్లో పార్టీ శ్రేణులను ఎన్నికల సమరానికి సమాయత్తం చేస్తూ పలు వ్యూహా లపై చర్చించారు. ఆర్థిక, సామాజిక, రాజకీయాంశాలపై తీర్మానాలు చేశారు. 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు- 2024 లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనే వరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

నడ్డా సారథ్యంలో బీజేపీ నలుదిశలా విస్తరించి బలోపేతమవుతోందని అమిత్‌ షా కొనియాడారు. నడ్డా పదవీకాలాన్ని పొడిగి స్తూ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ముక్తకంఠంతో అందరూ ఆ తీర్మానాన్ని ఆమోదించారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలపై నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలు, కుటు-ంబ రాజకీయాలు, అవినీతి గురించి సమావేశాల్లో చర్చించారు. వాటికి వ్యతిరేకంగా పోరా డుతున్న రాష్ట్ర నాయకత్వాల గురించి ప్రస్తావించారు.
ఈ క్రమంలో తెలంగాణలో బండి సంజయ్‌ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర గురించి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సహా జాతీయ నాయకత్వంలోని పలువురు నేతలు పలుమార్లు ప్రస్తావించి ప్రశంసల జల్లు కురిపించారు. సంజయ్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఇతర రాష్ట్రాల్ల్రోని నేతలు కూడా పోరాటపథంలో దూసుకెళ్లాలని, పార్టీని అధికారం లోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ శాయశక్తులా కృషి చేయాలని సూచించారు. ప్రజాసంగ్రామ యాత్రకు వస్తున్న స్పందనను ఈ సందర్భంగా ఉదహరించారు. బండి సంజయ్‌ పోరాట పటిమను అధినాయకత్వం మెచ్చుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement