Thursday, April 25, 2024

హుజురాబాద్ డిపో ఎత్తివేత కుట్రపై భగ్గుమన్న బీజేపీ శ్రేణులు

హుజురాబాద్ నియోజకవర్గంపై టిఆర్ఎస్ సర్కార్ సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేక, ప్రతీకార చర్యలు  చేపడుతుందని ఆరోపించారు.  అందులో భాగంగానే హుజురాబాద్ బస్ డిపోను మూసి వేసే కుట్రకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ ఆర్టీసీ డిపో ఎత్తివేసే కుట్రలను ఖండిస్తూ, హుజురాబాద్ డిపోను పరిరక్షించాలని కోరుతూ బిజెపి హుజరాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

డిపో ఎత్తివేస్తే ప్రక్రియను వెంటనే మానుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. పేద,మధ్య తరగతి ప్రజలకు రవాణా పరంగా ఉపయోగపడే హుజురాబాద్ ఆర్టీసీ డిపోను తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించడం ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యలో భాగమేనని ఆయన దుయ్యబట్టారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ సరిపోలేదు అన్నట్టు, ఆర్టీసీ భూములు  అమ్ముకోవాలనే దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement