Thursday, April 25, 2024

కేసీఆర్ వ్యాఖ్యలు జుగుప్సాకరం: పొంగులేటి

ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ఉపయోగిస్తున్న భాషను మార్చు కోవాలని బిజెపి తెలంగాణ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ సోమవారం మీడియా ప్రెస్ మీట్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడుతున్న తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి తాను స్వయం ప్రకటిత రైతు బాంధవుడిగా చలామణి అవుతూ.. రాష్ట్ర ప్రభుత్వ చేస్తున్న తప్పులను కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాష ఆశ్చర్యకరంగా జుగుప్సాకరమైన ఉందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఇంకా ఉప ఎన్నిక ఓటమి నైరాశ్యంలో   కొట్టుమిట్టాడుతున్నాడని విమర్శించారు.

కిషన్ రెడ్డి సాధారణ స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు కష్టపడి జాతీయ భావంతో దేశ భక్తి గల నాయకుడిగా ఎదిగారని గుర్తు చేశారు. కిషన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కనీసం గ్రామ రచ్చబండ దగ్గర కూడా అటువంటి భాష ఉపయోగించ పేర్కొన్నారు.  కెసిఆర్ సహనం కోల్పోయి అహంకార పూరితంగా మాట్లాడుతూ రైతు వ్యతిరేకిగా మారారని ఆయన విమర్శించారు. కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పొంగులేటి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement