Thursday, April 18, 2024

హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి కన్ఫర్మ్..

హుజూరాబాద్ అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. ఈటల రాజేందర్ కే టికెట్ ను కన్ఫర్మ్ చేసింది. బీజేపీ అధిష్ఠానం దీనిపై అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దాంతో పాటు మిజోరాంలోని తురివాల్, మహారాష్ట్రలోని చెగలూరు నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకూ అభ్యర్థులను ప్రకటించింది.

హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఈటలపై ప్రభుత్వం వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రభుత్వం మీద ప్రత్యారోపణలు చేస్తూ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక తప్పనిసరైంది.

అప్పట్నుంచి ఈటల ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. కొన్ని రోజులపాటు పాదయాత్ర కూడా చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2న ఫలితాలను ప్రకటిస్తారు. ఇప్పటికే టీఆర్ఎస్ తన అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను నిలిపింది. తొలిరోజే ఆయన నామినేషన్ వేశారు. ఇటు కాంగ్రెస్ కూడా నిన్ననే అభ్యర్థిగా ప్రకటించింది. విద్యార్థి విభాగం అధ్యక్షుడు బల్మూరు వెంకట్ కు టికెట్ ను ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Old city: భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్న బండి సంజ‌య్‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement