Friday, December 6, 2024

హుజురాబాద్ ఫలితాలు: ఏడో రౌండ్‌లోనూ తగ్గని ఈటల జోరు

హుజురాబాద్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ రసవత్తరంగా కొనసాగుతోంది. రౌండ్.. రౌండ్ కు టెన్షన్ పెంచుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ మినహా అన్ని రౌండ్లల్లోనూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఏడో రౌండ్‌ ఫలితాల్లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ లీడ్‌ లోకి వచ్చారు. ఏడో రౌండ్ లో బీజేపీకి 4044 ఓట్లు రాగా… టీఆర్‌ఎస్‌ కి 3792 పోల్‌ అయ్యాయి. దీంతో మొత్తం 3442 ఓట్ల లీడ్‌ ను ఈటల సంపాదించారు. ఇప్పటి వరకు బీజేపీకి 31,027 ఓట్లు రాగా… టీఆర్‌ఎస్‌కి 27,589 ఓట్లు, కాంగ్రెస్‌ పార్టీకి 1086 ఓట్లు పోల్‌ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement