Wednesday, March 27, 2024

బిట్ కాయిన్ పేరుతో భారీ మోసం

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండి అని పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. బాధితుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని ఎవరైనా చెప్పినా వినొద్దని పోలీసులు ఎంత చెప్పినా జనం వినడం లేదు. మోసం చేస్తున్నారని తెలిసాక అప్పుడు పోలీసులను ఆశ్రయించి మొర పెట్టుకుంటారు. తాజాగా బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరుతో హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లు మరో భారీ మోసానికి పాల్పడ్డారు.

అంబర్ పేట్ కు చెందిన నరేష్ అనే యువకుడిని ట్రాప్ చేసిన కేటుగాళ్లు..  కే-కీయున్ యాప్ డౌన్లోడ్ చేయించారు. బైనాన్స్ డాట్ కామ్ వెబ్ సైట్ ద్వారా డబ్బులు డిపాజిట్ చేసి కే-కాయిన్ యాప్ ద్వారా ట్రేడింగ్ చేయవచ్చని నమ్మించారు. దీంతో పలు విడతలుగా రూ.8 లక్షలు పెట్టుబడి పెట్టాడు నరేష్‌. అయితే, మరింత డిపాజిట్ చేయాలని కేటుగాళ్లు ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో బాధితుడు నరేష్ కి అనుమానం వచ్చి నిలదీశాడు. దీంతో ఫోన్ బ్లాక్ చేయడంతో పాటు యాప్ లింకు డిలీట్ చేశారు. తాను మోసపోయానని గ్రహించిన నరేష్‌.. సిటీ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండిః కరోనా థర్డ్ వేవ్ వచ్చినా తీవ్రత తక్కువే!

Advertisement

తాజా వార్తలు

Advertisement