Saturday, November 9, 2024

TG: బైకు అదుపు తప్పి… ఇద్దరు యువకులు మృతి…

రాయపర్తి, అక్టోబర్ 11(ప్రభ న్యూస్) : బైక్ అదుపుతప్పి ఇద్ద‌రు యువ‌కులు మృతిచెందిన సంఘటన మండలంలోని కిష్టాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే… గురువారం సద్దుల బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న అనంతరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎర్ర శ్రీనివాస్ లలిత కుమారుడు రాజు (20), ఏదునూరి యాకయ్య కల్యాణి కుమారుడు అన్వేష్ (18) కాట్రపల్లిలోని స్నేని వద్దకు బైకు పై వెళుతుండగా దాదాపు 11 గంటల ప్రాంతంలో వాంకుడోత్ తండ సమీపంలోని తోడేలు బండ తండా వద్ద బైకు అదుపుతప్పి అక్కడికక్కడే మృతి చెందారు.

ఉదయం అటుగా వెళుతున్న బాటసారులు చూసి సమాచారం అందించడంతో చాణిక్య ఎస్ఐ శ్రావణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement