Monday, November 29, 2021

బస్సును ఢీకొన్న బైక్​.. ఒకరికి తీవ్ర గాయాలు..

గణపురం, (ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గాంధీనగర్ – గణపురం రహదారిపై గురువారం ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ములుగు జిల్లా బండారుపల్లి గ్రామానికి చెందిన నీలం లక్ష్మీనారాయణ వృత్తిరీత్యా భూపాలపల్లి మండలం గొర్ల వీడులో జూనియర్ లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు.

గురువారం స్వగ్రామానికి వెళ్లి తిరిగి వెళ్తున్న క్రమంలో గాంధీనగర్ వద్ద పరకాల డిపోకు చెందిన పాలంపేట ములుగు బస్సు గణపురం వైపు వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న బస్సును గమనించక ద్విచక్ర వాహనం ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనాన్ని సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రున్ని ములుగు సామాజిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News