Saturday, April 20, 2024

Big Story: దళిత బంధుపై తగ్గేదేలే.. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నకేసీఆర్

హదరాబాద్‌, ఆంధ్రప్రభ: హుజూరాబాద్‌ రిజల్ట్‌ తర్వాత విపక్షాలు రకరకాల కామెంట్లు చేస్తుండగా, వీటికి చెక్‌ చెప్పేలా అధికారులు కార్యాచరణను ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని నాలుగు దిక్కుల ఎస్సీ నియో జకవర్గాల్లోని మండలాల్లో.. పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న దళితబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరా తీసినట్లు తెలిసింది. పథకానికి సంబంధించి.. ఇటీవల నిధులు కూడా విడుదల చేయగా, త్వరలో.. సీఎం నల్లగొండ లేదా ఖమ్మం జిల్లాలో పర్యటించే అవకాశాలున్నా యని అధికారవర్గాలలో చర్చ జరుగుతోంది. తెలంగాణ రైతుబంధు పథకాన్ని 4 జిల్లాల్లోని 4 మండలాల్లో అమలు చేసేందుకు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ సన్నద్ద మైంది.

ఇప్పటికే హుజురాబాద్‌ అసెంబ్లి నియోజకవర్గంతో పాటు సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన వాసాల మర్రిలో ఈ పథకాన్ని అమలు చేశారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ పురోగమనంలో ఉంది. ఇదంతా.. ఓ ఎత్తయితే.. తర్వాత ప్రక్రియపై సర్కారు దృష్టి సారించింది. మధిర అసెంబ్లి నియోజకవర్గంలోని చింతకాని, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ, జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌ మండలాల్లో దళిత బంధు పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా అమలుచేస్తున్న విషయం విదితమే. ఇప్పటికే ఆయా మండలాల్లో.. దళితబంధు అమలు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది.

లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యాక స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుపై వారికి అవగాహన కల్పిస్తారు. అవసరమైతే స్వల్పకాలిక శిక్షణ తరగతులు సైతం నిర్వహించాలని అభివృద్ధి శాఖ భావిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన నగదుతో ఎలాంటి ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చనే దానిపై లబ్ధిదారులకు ప్రయోగాత్మకంగా వివరిస్తారు. ఇప్ప టికే హుజురాబాద్‌లో ఈ పథకం అమలు, స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు తదితర అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను అధికారులు తయారు చేశా రు. ఉపాధి యూనిట్ల ఏర్పాటుపై లబ్ధిదారులు అంచనాకు వచ్చిన తర్వాత నగదును విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఈ నాలుగు మండలాల్లో లబ్దిదారుల్లో అవగాహన కలిగించిన తర్వాత.. తర్వాత దశలో రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గానికి వందమంది చొప్పున ఈ పథ కాన్ని మంజూరుచేసే అవకాశాలున్నాయి. దేశంలో ఎక్కడాలేని ఈ పథకాన్ని సీఎం ఎంతో ఇష్టపడిరూ పొందించగా, పట్టుదలగా సక్సెస్‌ చేయాలని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement