Friday, March 29, 2024

డిజిట‌ల్ మెంబ‌ర్ షిప్ కార్య‌క్ర‌మాన్ని ప‌రిశీలించిన భూప‌తిరెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 125 డివిజన్ (గాజులరామారం) బూత్ నెం. 294, 296 బూత్ లలో సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో, 126వ‌ డివిజన్ (జగద్గిరిగుట్ట) బూత్ నెం.332, 339లో గూడ వరమ్మ- ఐలయ్య గౌడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమాన్ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ప‌రిశీలించారు. బండి శ్యామ్ గౌడ్, కందాడి శివారెడ్డి, రామా గౌడ్, ఏ బ్లాక్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ గౌడ్, TPCC మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మీ, DCC ఉపాధ్యక్షులు దమ్మాని శ్రవణ్ కుమార్, జేమ్స్, గొల్ల జాన్, ఖాజా భాయ్, త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 125వ‌ డివిజన్ నుండి లాల్ మొహమ్మద్, గఫార్, అంజద్, యూసుఫ్, అసిఫ్, 125వ‌ డివిజన్ మహిళా అధ్యక్షురాలు రెహనా బేగం, దండే సతీష్, చందు, రాజ్ కుమార్, అమర్ కాంబ్లీ, జాకీయా, తిరుపతి రెడ్డి, 126వ‌ డివిజన్ నుండి భరత్ గౌడ్, సాయి ప్రవీణ్ గౌడ్, విశ్వజిత్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement