Thursday, April 25, 2024

ప్రాణహిత పుష్కరాలపై కలెక్టర్ సమీక్ష

ప్రాణహిత పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన బడ్జెట్ కోసం పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు అందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో ప్రాణహిత పుష్కరాలు-2022 నిర్వహణపై జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, జిల్లా అదనపు కలెక్టర్ టి.ఎస్ దివాకరలతో కలిసి  ముందస్తుగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రాణహిత పుష్కరాలు జిల్లాలోని కాళేశ్వరంలో వైభవంగా నిర్వహించేందుకు శాఖల వారీగా అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను పూర్తిస్థాయిలో  అందజేయాలని అన్నారు. 2022 లో ఏప్రిల్ 13 నుండి 24 వరకు ప్రాణహిత నదికి పుష్కరాలు జరగనున్నాయని, జిల్లాలో త్రివేణి సంగమమైన కాళేశ్వరంలో ప్రాణహిత పుష్కరాలను నిర్వహించనున్నామని తెలిపారు. 12 రోజులు నిర్వహించే ఈ పుష్కరాలకు ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి పుష్కర భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పుష్కరాలను నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు ముందస్తుగా పగడ్బందీగా అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని అన్నారు.

లక్షలాదిగా తరలివచ్చే భక్తులతో పరిసరాలు అపరిశుభ్రంగా కాకుండా పంచాయతీశాఖ సిబ్బంది 24 గంటలు పారిశుద్ధ్య పనులు నిరంతరం సాగేలా సెక్టార్ వారిగా  3 షిఫ్టుల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమించాలన్నారు. కాలేశ్వరం ప్రాంతం మొత్తం విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని, ఆర్డబ్ల్యూఎస్ ఇప్పుడున్న వాటర్ ట్యాంక్ లతోపాటు అదనంగా వాటర్ ట్యాంక్ లను ఏర్పాటు చేసి చేతిపంపులు మరమ్మతులకు చేయలన్నారు. భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రయాణించేందుకు కాలేశ్వరంలో రహదారుల మరమ్మతు, రహదారుల వెడల్పు చేపట్టాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement