Saturday, May 28, 2022

భోగి భాగ్యాల సంబురం.. హ‌రిదాసులు, గంగిరెద్దుల ప్ర‌ద‌ర్శ‌న‌

భోగి సంబరాలు పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో మిన్నంటాయి. మొదటిసారిగా పెద్దపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో జెండా కూడలిలో భోగి సంబరాలను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. హరిదాసుల నృత్యాలు, గంగిరెద్దుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

భోగి మంటలను పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరిమమత ప్రశాంత్ రెడ్డి వెలిగించారు. బంగ్లా ఎమ్మెల్యే మాట్లాడుతూ భోగి నియోజకవర్గ ప్రజల అందరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement