Thursday, April 25, 2024

భూదానోద్యమ ప్రదేశాన్ని సందర్శించడం నా అదృష్టం.. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క

ప్రభన్యూస్,ప్రతినిధి/యాదాద్రి భూదానోద్యమ ప్రదేశాన్ని సందర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలంలోని పెద్ద రావులపల్లి గ్రామం నుంచి మండలంలో ప్రారంభమై గౌస్ కొండ, రెవనపల్లి గ్రామాల మీదగా పురపాలక కేంద్రంలోని నేతాజీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొందరి కోసం కాదు అందరి కోసం అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మూడేకాల భూమి పంచుతామని పంచకపోగా పంచిన భూములను తాకట్టు ఉందని విమర్శించారు. ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం ప్రశ్నపత్రాలను అమ్ముకుంటూ నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. మూసి ప్రక్షాళన బాధ్యతగా చేపట్టి ప్రజలను ఆదుకుంటానన్నారు. 2024 లో ఇందిరామరాజ్యం తీసుకువచ్చి అన్ని వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఇంద స్థలాన్ని ఇవ్వడంతో పాటు ఐదు లక్షల నిర్మాణానికి అందిస్తామని అన్నారు. రేషన్ బియ్యం తో పాటు నిత్యవసర వస్తువులను గ్యాస్ ను రూ. 500 కే అందిస్తామన్నారు. రైతులు రుణమాఫీని ఒకేసారి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజా సమస్యలపై పట్టింపు లేదు. .డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ప్రజా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డికి పట్టింపు లేదని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి విమర్శించారు. రైతుల పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్న సకాలంలో కొనుగోలు చేయలేని అసమర్ధత ప్రభుత్వమని విమర్శించారు

. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గం ఇంచార్జ్ ఐలయ్య, కాంగ్రెస్ నాయకులు పొత్నక్ ప్రమోద్ కుమార్, తంగెళ్లపల్లి రవికుమార్, వలిగొండ ఎంపీపీ రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తడక వెంకటేశం, మండల అధ్యక్షులు పాక మల్లేష్, పట్టణ అధ్యక్షుడు భారత లవ కుమార్, గుడిగంటి రమేష్, భారత వాసుదేవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement