Friday, December 6, 2024

TG: వైఎస్ఆర్ కు భట్టి, తుమ్మల నివాళులు..

ఖమ్మం : ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో గౌరవ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో గిడ్డంగుల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement