Saturday, September 30, 2023

సూర్యాపేటలో ఎలుగుబంటి కలకలం

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఎలుగుబంటి కలకలం చెలరేగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి ఎలుగుబంటి ప్రవేశించింది. భయాందోళనకు గురైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలుగుబంటి బయటకు వచ్చి ఎక్కడ ప్రజలపై దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement