Friday, November 29, 2024

BREAKING | బీసీ గణన.. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా కమిషన్: సీఎం రేవంత్

బీసీ కులగణాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని త‌న‌ నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కులగణపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని బీసీ కులాల కోసం అంకితభావం కమిషన్‌ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

హైకోర్టు తీర్పుకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాల‌ని ప్రభుత్వ నిర్ణయించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు రేపటి లోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. కాగా, బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.. కులగణనపై ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవ‌ని సీఎం రేవ‌తం మరోసారి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement