Friday, November 8, 2024

Basara:మ‌హాగౌరీ అవ‌తారంలో…భాసర అమ్మవారు.

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, బాస‌ర : బాస‌ర క్షేత్రంలో శార‌దీయ న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. గురువారం జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారు మ‌హాగౌరీ అవ‌తారంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా అమ్మవారికి అర్చకులు విశేష గౌరీ నామార్చన పూజ చేశారు. అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి తెల్ల‌వారు జామున ఐదు గంట‌ల నుంచి భ‌క్తులు బారులు తీరారు.

చ‌క్కెర పొంగ‌లి నైవేద్యం
గోదావరి నదీలో భ‌క్తులు పుణ్య స్నానాలు ఆచరించి నదీ తీరాన గల శివాలయంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం మండ‌పంలో అక్ష‌ర‌భ్యాస కార్యక్ర‌మాలు నిర్వ‌హించారు. ఆలయంలో కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి సన్నిధిలోని నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement