Friday, April 19, 2024

తెలంగాణ‌లో లీకేజీ, ప్యాకేజీల స‌ర్కార్ – బండి

హైదరాబాద్‌: లీకేజీ, ప్యాకేజీ, నిరుద్యోగుల డ్యామేజీ సర్కారు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. గ్రూప్‌-1 ప్రశ్నాపత్రం కూడా లీకైందన్న ఆయ‌న అందుకు సాక్ష్యంగా ప్రవీణ్ రాసిన గ్రూప్ వ‌న్ ప్రిలిమిన‌రీ ఓఎంఆర్‌ షీట్‌ను మీడియాకు విడుదల చేశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ”పేపర్‌ లీక్‌ చేసిన టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్‌కు అత్యధిక మార్కులా? ప్రవీణ్‌ కోసం ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారా? నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులందరినీ తొలగించాల్సిందే. రాబోయే రెండు నెలల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలన్నీ కేసీఆర్‌ టీమ్‌కు లీకయ్యాయి. గతంలో సింగరేణి పరీక్షా పత్రాలు కూడా లీకయ్యాయి. ఉద్యోగాలు ఇవ్వలేక ఇంత దారుణాలకు ఒడిగడతారా? ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై న్యాయవిచారణ జరిపించాల్సిందే. లేని పక్షంలో నిరుద్యోగులతో కలిసి ప్రగతిభవన్‌, టీఎస్‌పీఎస్సీని ముట్టడిస్తాం” అని హెచ్చ‌రించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement