Thursday, April 18, 2024

తెలంగాణలో క్విట్ ఇండియా నాటి పరిస్థితి: బండి

తెలంగాణలో క్విట్ ఇండియా’నాటి పరిస్థితులే నెలకొన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో బండి సమావేశం అయ్యారు. ఆగస్టు 9 నుండి ప్రారంభం కానున్న పాదయాత్ర గురించి సీనియర్ నేతలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ విధానాలను ఎండగట్టి ప్రజా స్వామిక తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు పడుతున్న బాధలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే పాదయాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుండే పాదయాత్ర ప్రారంభం అవుతుందని చెప్పారు. పాదయాత్ర విజయవంతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీనియర్ నేతల నుండి  అభిప్రాయాలు బండి సంజయ్ కోరారు.

కాగా, సమావేశానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె.అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్మణ్, ఎంపీ సోయం బాపూరావు, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, ఎంపీలు విజయశాంతి, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ తదితరులు హాజరైయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement