Thursday, April 25, 2024

సిరివెన్నెల పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయి: బండి

ప్రముఖ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) మరణంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సీతారామశాస్త్రి మరణం రాష్ట్ర ప్రజలకు, సినీ పరిశ్రమకు తీరని లోటని ఆయన అన్నారు. సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాదాపు 3 వేల పాటలు రచించిన సీతారామశాస్త్రి.. ఉత్తమ పాటల రచయితగా 11 నంది అవార్డులు, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించిన గొప్ప రచయిత అని కొనియాడారు. తెల్లారి లెగండోయ్…. నిగ్గదీసి అడుగు…ఇంటి పేరు కాదుర గాంధీ, ఆదిభిక్షువు వాడిని ఏది అడిగేది…అర్థ శతాబ్దపు అజ్ఝానాన్ని…తరలిరాద తనే వసంతం…ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్లు… అంటూ ఆయన రాసిన ఎన్నో పాటలు ప్రజల మనుసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని గుర్తు చేశారు. సీతారామశాస్త్రి రాసిన ప్రతి పాట ప్రజల మనసును దోచుకునేలా ఉంటుందన్నారు. సీతారామశాస్త్రి మన మధ్య భౌతికంగా లేకపోయినా పాటల రూపంలో చిరస్థాయిగా ప్రజల మనసుల్లో నిలిచిపోయారని బండి సంజయ్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement