Wednesday, April 24, 2024

బైంసా సిటీ శివారులో బండి సంజ‌య్ బ‌హిరంగ‌స‌భ‌.. భారీగా మోహ‌రించిన పోలీసులు

హైకోర్టు అనుమ‌తితో ఐదో విడ‌త ప్ర‌జా సంగ్రామ యాత్ర‌ను మొద‌లు పెట్టారు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్య‌క్షుడు బండి సంజ‌య్.కాగా 144 సెక్షన్ అమల్లో ఉన్న భైంసా సిటీకి శివారులో మంగళవారం బహిరంగ సభ ఉండబోతోంది. ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ. పోలీసులు నో పర్మిషన్ అన్నారు. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభా వేదిక మారినా.. రూట్‌ మ్యాప్‌లో చిన్న మార్పులు చోటు చేసుకున్నా కమలనాథుల్లో జోష్ మాత్రం తగ్గలేదు. మంగళవారం మధ్యాహ్నం 1.30కి భైంసా శివారులో బహిరంగ సభ జరగనుంది. నిర్మల్ నేషనల్ హైవే పక్కన ఉన్న గణేశ్ ఇండస్ట్రీ ప్రాంగణంలో దీన్ని నిర్వహించాలని నిన్న రాత్రి 11 గంటలకు పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఈ సభకు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. భైంసా వెళ్లకూడదని, సభను కూడా భైంసా టౌన్‌కు 3 కిలోమీటర్ల దూరంలో పెట్టుకోవాలని చెప్పింది. 500 మందితో పాదయాత్ర, 3 వేల మందితో సభ జరుపుకోవాలని ఆదేశించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపే మీటింగ్‌ పెట్టుకోవాలని సూచించింది. ఇతర మతాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని…అలాగే కార్యకర్తలు కర్రలు, ఆయుధాలు వాడొద్దని హైకోర్టు స్పష్టంచేసింది. హైకోర్టు సూచనల మేరకు సభాస్థలిని మార్చింది బీజేపీ. మాటేగాం, మహాగాంలో స్థలాలను నేతలు పరిశీలించారు. అయితే స్థలాలు అనుకూలంగా లేకపోవడంతో.. పార్డీబి క్రాస్‌ వద్దనే సభ నిర్వహించాలని నిర్ణయించింది బీజేపీ. సభకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, గౌరవ అతిథిగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ పాల్గొంటారని పార్టీవర్గాలు తెలిపాయి.బీజేపీ భారీ బహిరంగ సభ ఉండటంతో నిర్మల్ జిల్లా భైంసాలో 144 సెక్షన్ అమల్లో ఉంది. నిన్న అమల్లోకి తెచ్చిన ఈ సెక్షన్‌ను ఇవాళ కూడా అమల్లో ఉంచుతున్నారు. ఈ కారణంగా భైంసాలో భారీగా పోలీసులు మోహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement