Friday, April 26, 2024

ఎమ్మెల్సీగా బండా ప్రకాశ్‌ ప్రమాణం స్వీకారం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన బండా ప్రకాశ్‌ బుధవారం ప్రమాణం స్వీకారం చేశారు. ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఛాంబర్ లో జరిగిన కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, టీఆర్ఎస్ ఎంపీ కేకే, ఎమ్మెల్సీ కడియం, ప్రజా ప్రతినిధులు, బండ ప్రకాష్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

కాగా, ఎమ్మెల్యేల కోటాలో ఇటీవల శాసన మండలికి ఎన్నికైన ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు డిసెంబర్ 2న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, పి.వెంకట్‌ రాంరెడ్డి, తక్కల్లపల్లి రవీందర్‌రావు ప్రమాణం చేశారు. అయితే,  తన రాజ్యసభ సభ్యత్వం ఆమోదం పొందిన నేపథ్యంలో ఎమ్మెల్సీగా బండా ప్రకాశ్‌ నేడు ప్రమాణ స్వీకారం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement