Friday, April 19, 2024

ఇంద్రకరణ్ రెడ్డితో బాల్క సుమన్ భేటీ

చెన్నూరు నియోజకవర్గంలోని రోడ్ల నిర్మాణం కోసం అటవీశాఖ అనుమతులు ఇప్పించాలని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరారు. సోమవారం హైదరాబాదులో చెన్నూరు నియోజకవర్గంలోని రోడ్లు, పలు అభివృద్ధి పనులకు సంబంధించిన అటవీశాఖ అనుమతుల కోసమై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో సమావేశమయ్యారు. అటవీ శాఖ అనుమతులు రాకపోవడం వల్ల రోడ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండే విఠల్, డోబ్రియల్ పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement