Tuesday, April 16, 2024

నేర పరిశోధనలో పోలీసులకు అవార్డులు.. దేశవ్యాప్తంగా 151 మంది ఎంపిక

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ సిబ్బందికి ప్రతి ఏటా ప్రదానం చేస్తున్న కేంద్ర హోం మంత్రి “ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్” అవార్డుకు 2022 ఏడాదికి గాను దేశవ్యాప్తంగా 151 మంది ఎంపికయ్యారు. 2018 నుంచి యూనియన్ హోం మినిస్టర్ “ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్” అవార్డును అందజేస్తున్నారు. నేర పరిశోధనలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని గుర్తించి ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కేంద్ర హోంశాఖ ఈ అవార్డులను ప్రధానం చేస్తోంది.

2022 సంవత్సరానికి ఎంపికైన 151 మందిలో సీబీఐ నుంచి 15 మంది అధికారులున్నారు. వీరితో పాటు మహారాష్ట్ర పోలీసు శాఖ నుంచి 11 మంది, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగాల నుంచి 10 మంది చొప్పున, కేరళ , రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ పోలీసు శాఖల నుంచి తలా 8 మంది చొప్పున అవార్డులకు ఎన్నికయ్యారు. అవార్డులకు ఎంపికైన వారిలో 28 మంది మహిళా పోలీసు అధికారులు ఉన్నారు. మెడల్స్ పొందినవారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పోలీసు విభాగాల్లో పనిచేస్తున్నవారితో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐలో పనిచేస్తున్న తెలుగువారు కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement