Sunday, October 20, 2024

TG: బాలికపై లైంగిక దాడికి యత్నం… వృద్ధుడికి దేహశుద్ధి

కాల్వశ్రీరాంపూర్, ఆంధ్రప్రభ : అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై 65ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి యత్నించిన సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఓ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి వృద్ధుడు అదే గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికపై గ్రామంలో ఉన్న ప్రభుత్వ మరుగుదొడ్ల లోపల లైంగిక దాడికి యత్నించాడు.

అది గమనించిన గ్రామస్తులు వృద్ధునికి దేహశుద్ధి చేసి బాలిక తల్లిదండ్రులకు విషయం తెలియజేశారు. బాలిక కుటుంబ సభ్యులు ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెద్దపెల్లి జిల్లాలో సంఘటనపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement