Thursday, December 5, 2024

TG | పసికందు కిడ్నాప్‌కు యత్నం… మహిళ రిమాండ్ !

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : నగరంలోని కోఠి ప్రభుత్వాస్పత్రిలో పసికందును కిడ్నాప్‌ చేసేందుకు యత్నించిన మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోఠి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళను గుర్తించి సెక్యూరిటీ గార్డు పోలీసులు సమాచారం ఇవ్వడంతో సుల్తాన్‌ బజార్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రెయిన్‌ బజార్‌ నెహ్రూనగర్‌ ప్రాంతానికి చెందిన అస్కారి బేగం (45) ఇండ్లలో పనిమనిషిగా పనిచేస్తూ జీవిస్తోంది. ఓగుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన ఆఫర్‌తో కిడ్నాప్‌కు యత్నించింది. ఈనెల 5న ఆస్పత్రిలో ఉన్నిసాబేగం అనే మహిళ మగబిడ్డకు జన్మనిచ్చివ్వగా ఆ శిశువును అపహరించేందుకు యత్నించింది.

వెంటనే గమనించిన సెక్యూరిటీ గార్డు ఆమెను బెదిరించి అక్కడినుంచి పంపించాడు. అయితే మరసటి రోజు ఆస్పత్రికి వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో సెక్యూరిటీ సిబ్బంది ఆమెను సుల్తాన్‌ బజార్‌ పోలీసులకు అప్పగించారు.

అస్కారిబేగంపై కిడ్నాప్‌ కేసు నమోదు చేసి రిమాండ్‌ కు తరలించారు. ఆస్కారిబేగంపై గతంలో పలు కేసులు ఉన్నట్లు తెలిసింది. 9 పోలీస్‌ స్టేషన్లలో ఇదే తరహా కేసులు నమోదు అయినట్టు పోలీసులు విచారణలో తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement