Sunday, December 4, 2022

అరవింద్ ఇంటిపై దాడి.. ఏ కులానికి, వర్గానికి, మతానికో ఆపాదించరాదు: మంత్రి గంగుల‌

ఎమ్మెల్సీ కవితను తెలంగాణ ఆడబిడ్డగా గౌరవించుకోవల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శ‌నివారం క‌రీంన‌గ‌ర్‌లో మీడియాతో మాట్లాడారు. ఎంపీ అరవింద్, ఎమ్మెల్సీ కవిత వివాదం రాజకీయ కోణంలోనే చూడాలే తప్ప.. అరవింద్ ఇంటిపై దాడిని ఏ కులానికి, వర్గానికి, మతానికో ఆపాదించరాదన్నారు.

- Advertisement -
   

అరవింద్ మున్నూరు కాపు అయినంత మాత్రాన ఈ దాడిని మున్నూరు కాపుల‌పై దాడిగా భావించరాదని, దాడులపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఎంపీగా ధర్మపురి అరవింద్ హుందాగా మాట్లాడాలే కానీ, ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడొద్దన్నారు. ఎమ్మెల్సీ కవితపై అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

ఇది కూడా చదవండి: Politics: కాంగ్రెస్‌లో హీటెక్కిస్తున్న‌ అంతర్గత రాజకీయం.. మరోసారి బయటపడ్డ విభేదాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement