Saturday, December 7, 2024

HYD | బండ్లగూడలో దారుణం… భార్య‌ను చంపిన భ‌ర్త

పాతబస్తీ బండ్లగూడలో దారుణం జరిగింది. భార్య గొంతుకోసి హత్య చేసి… మృతదేహాన్ని తగులబెట్టాడు ఓ భర్త. ఈ సంఘటన మంగళవారం తెరపైకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.భార్య ఖమర్ బేగం ను దారుణంగా హతమార్చాడు భర్త ఫైజ్ ఖురేషి. అనంతరం మృతదేహాన్ని తగలబెట్టాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

మనస్పర్థల కారణంగా భార్య తో తరుచూ గొడవ పెట్టుకునేవాడు భర్త ఫైజ్ ఖురేషి.అయితే… గత అర్ధరాత్రి మరోసారి ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ తరుణంలోనే భార్య ఖమర్ పై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు భర్త ఫైజ్ ఖురేషి. అనంతరం మృతదేహాన్ని తగలబెట్టి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు భర్త ఫైజ్ ఖురేషి.. అయితే… చుట్టుపక్కల వాళ్ళు రావడంతో.. నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్ళి లొంగిపోయాడు భర్త ఫైజ్ ఖురేషి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement