Saturday, April 20, 2024

గచ్చిబౌలి స్టేడియం వద్ద క్రీడాకారులు ఆందోళన

హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో వద్ద ఉద్రికత్త నెలకొంది. స్టేడియంలో క్రీడాకారులు, అథ్లెట్లు ఆందోళనకు దిగారు. టిమ్స్ ఆస్పత్రి కోసం ప్రభుత్వం 9 ఎకరాలను కేటాయించింది. అయితే, స్టేడియంలోని మరో 5 ఎకరాలు టీమ్స్‌కు కేటాయించాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం నిర్ణయంపై అథ్లెట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేడియంను కాపాడాలని ధర్నాకు దిగారు. తెలుగు రాష్ట్రాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఒకే ఒక్క స్టేడియం గచ్చిబౌలి అని దాన్ని కాపాడాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్టేడియాన్ని విచ్ఛినం చేయడం సరికాదని వారు అంటున్నారు. 

ఇది కూడా చదవండి: హుస్నాబాద్‌లో బండి సంజయ్ పాదయాత్ర ముగింపు!

Advertisement

తాజా వార్తలు

Advertisement