Saturday, December 7, 2024

Assembly Election – ఆ రెండు రాష్ట్రాల ఎన్నిక‌ల ప‌రిశీల‌కులుగా తెలంగాణ మంత్రులు

మ‌హారాష్ట్ర‌, ఝార్ఖండ్ ల‌కు అసెంబ్లీ ఎన్నిక‌లు
ఈ రెండు రాష్ట్రాల‌కు ప‌రిశీల‌కుల‌ను నియ‌మించిన కాంగ్రెస్
మ‌హారాష్ట్ర‌కు ఉత్త‌మ్, సీత‌క్క‌…
ఝార్ఖండ్ కు భ‌ట్టి విక్ర‌మార్క నియ‌మాకం

ఢిల్లీ: మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు కల్పించింది. మహారాష్ట్రలోని 5 డివిజన్లకు 11 మందిని నియమించగా.. వీరిలో రాష్ట్ర మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి, సీతక్క ఉన్నారు. ఝార్ఖండ్ కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు తారిక్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిని నియమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement