Thursday, November 28, 2024

Arrived – హైద‌రాబాద్ చేరుకున్న కెటిఆర్ – నేటి షెడ్యూల్ ఇదే ..

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసింది. శనివారం ఉదయం విదేశీ పర్యటన ముగించుకుని కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. రెండు వారాల అమెరికా పర్యటన తర్వాత హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు చేరుకున్న కేటీఆర్‌ నేరుగా నందినగర్‌ వెళ్లారు. అనంతరం తన ఇంటికి పయనం అయ్యారు.
కాగా, నేడు కొండాపూర్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ల‌నున్నారు కెటిఆర్.. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల గురించి వివ‌రాల‌ను అడిగి తెలుసుకోనున్నారు.. ఇక మధ్యాహ్నం 2 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మాజీపేట మండలం, ఆవంచ గ్రామంలో జడ్చర్ల మాజీ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారి సతీమణి అనారోగ్యంతో ఇటీవల మరణించిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించ‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement