Thursday, November 7, 2024

Appeal – ఇంత‌టితో కొండా ఎపిసోడ్ ను వ‌దిలేద్దాం – టాలీవుడ్ కు పిసిసి చీఫ్ అభ్య‌ర్ధ‌న

మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తాయి. పరిస్థితి గమనించిన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలకు కీలక విజ్ఞప్తి చేశారాయన. . ఓ నటీమణిపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు విచారకరమని పేర్కొన్నారు. సదరు వ్యాఖ్యలను మంత్రి ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయాలని విజ్ఞప్తి చేశారాయన. భవిష్యత్‌లో సినీరంగానికి చెందిన వ్యక్తులను రాజకీయ వివాదాల్లోకి లాగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement