Wednesday, November 6, 2024

AndhrPrabha’s Effect నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి స‌స్పెన్ష‌న్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, నిజామాబాద్ : నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తి ని స‌స్పెండ్ చేస్తూ డీజీపీ జితేంద‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న విష‌యం ఆంధ్ర‌ప్ర‌భ దిన‌ప‌త్రిలో ప్ర‌చురిత‌మైన క‌థ‌నానికి పోలీసు ఉన్న‌తాధికారులు స్పందించారు. ఐదు రోజు కింద‌ట ఏసీపీ విష్ణుమూర్తిని డీజీపీ కార్యాల‌యానికి అటాచ్ చేస్తూ డీజీపీ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఏసీపీపై సీపీ క‌ల్మేశ్వ‌ర్ విచార‌ణ చేప‌ట్టి డీజీపీకి నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక అధారంగా ఏసీపీని స‌స్పెన్ష‌న్ చేస్తూ డీజీపీ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement