Saturday, December 7, 2024

HYD | ప్రజావాణికి వినతుల వెల్లువ

హైదరాబాద్, నవంబర్ 8 : మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 471 దరఖాస్తులు అందాయి. బీసీ వెల్ఫేర్ శాఖకు సంబంధించి 156, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కు సంబంధించి 87, విద్యుత్ శాఖ కు సంబంధించి 75, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 50 ప్రవాసి ప్రజావాణికి సంబంధించి 04, ఇతర శాఖలకు సంబంధించి 99 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా.చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్ కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement