Thursday, April 25, 2024

టీ.యూ లోనే ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలి..

నిజామాబాద్‌ అర్బన్‌, (ప్రభన్యూస్‌) : నిజామాబాద్‌ జిల్లాకు మంజూరైన ఇంజనీరింగ్‌ కళాశాలను తెలంగాణ యూనివర్సిటీలోనే ఏర్పాటు చేయాలని టీయూ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పంచరెడ్డి చరణ్‌ డిమాండ్‌ చేసారు. ఆదివారం తెలంగాణ యునివర్సటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు మంజూరు అయినటువంటి జెఎన్‌టియు అనుబంధ ఇంజనీరింగ్‌ కళాశాలలో డిచ్పల్లిలో గల టీయూ క్యాంపస్‌లోనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంజనీరింగ్‌ కళాశాలను తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసే విధంగా చొరవ తీసుకోవాలని ఇంజనీరింగ్‌ కళాశాలవల్ల విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధి చెందుతుందని పేద విద్యార్థులకు నాణ్యమైన ఇంజనీరింగ్‌ విద్య అందుతుందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో టివియువి రాష్ట్ర కోఆర్డినే టర్‌ రమావత్‌ లాల్‌సింగ్‌, టిజివిపి రాష్ట్ర కార్యదర్శి సజ్జనం భానుచందర్‌, యన్‌.యస్‌.యు.ఐ జిల్లా ఉపా ధ్యక్షులు వరుణ్‌, దత్తు, అజరు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement