Saturday, November 27, 2021

బాదములు బ్ల‌డ్ షుగ‌ర్ ను త‌గ్గిస్తాయి

బాదములను అల్పాహారంగా ఉదయం పూట తీసుకోవడం వల్ల అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం అల్పాహార అనంతర బ్లడ్‌ షుగర్‌ స్పందన సైతం త‌గ్గుతుంద‌ని యూనివ‌ర్శిటీ ఆఫ్ ఒటాగో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ న్యూట్రిషన్ ప్రొఫెస‌ర్, లీడ్ రీసెర్చ్ డా.రాచెల్ బ్రౌన్ తెలిపారు. ఆయ‌న మాట్లాడుతూ…
ఆల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా నేతృత్వంలోని నూతన అధ్యయనం వెల్లడించేదాని ప్రకారం, ఉదయం పూట అల్పాహారంగా బాదములను తీసుకోవడం (సాధారణంగా కార్బోహడ్రేట్స్‌ అధికంగా కలిగిన ఆహారం తో పోలిస్తే) వల్ల బ్లడ్‌ షుగర్‌ స్ధాయి మరింత స్థిరంగా ఉంటుందన్నారు.

రోజులో మిగిలిన సమయంలో తీసుకునే కేలరీల సంఖ్య పరంగా కూడా నియంత్రణ విధిస్తుందన్నారు. ఇది అతి ముఖ్యమైన అంశమ‌ని, ఎందుకంటే అల్పాహారం తీసుకున్న తరువాత లేదంటే భోజనం తీసుకున్న తరువాత అధికంగా బ్లడ్‌ షుగర్‌ ఉండటం వల్ల గుండె వ్యాధుల ప్రమాదం పెరగడంతో పాటుగా మరణాలకూ కారణమవుతుందన్నారు. న్యూట్రిషన్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ… భారతదేశంలో ఆరోగ్యపరంగా టైప్‌2 మధుమేహం ఆందోళనకరమైన అంశంగా నిలుస్తుందన్నారు. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన, కేలరీలు అధికంగా కలిగిన బిస్కెట్స్‌లాంటి స్నాక్స్‌ తీసుకోవడం కారణమ‌న్నారు. ఈ స్నాక్స్‌కు బదులుగా బాదములను తీసుకోవడం వల్ల బ్లడ్‌ షుగర్‌ స్ధాయి నియంత్రణలో ఉంటుందన్నారు. బాదములలో ఫైబర్‌, ప్రొటీన్‌, మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్స్‌వంటివి ఉంటాయని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News