Friday, April 19, 2024

21 జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణాలకు భూముల కేటాయింపు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కొత్తగా ఉనికిలోకి వచ్చిన 21 జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తూ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని సౌకర్యాలు, అవసరమైన వసతులతో కోర్టు కాంప్లెక్సుల నిర్మాణాలకు అనువైన స్థలాలను గుర్తించాలని గతంలో ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి వివరాలను సేకరించింది. మంచిర్యాల, వనపర్తి జిల్లాలు మినహా మిగతా 21 జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్‌ నూతన భవనాలను నిర్మించాలని గతంలో సీఎం కేసీఆర్‌ సంకల్పించి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ సమగ్ర వివరాలను సేకరించి అనువైన ప్రభుత్వ భూములను గుర్తించింది.

ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యల్‌, జనగాం, జోగులాంభ, కామారెడ్డి, నారాయణఖేడ్‌, వికారాబాద్‌, వరంగల్‌, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్‌లలో 10 ఎకరాల చొప్పున, మెదక్‌లో 9 ఎకరాలను, మేడ్చేల్‌ మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూలు, నిర్మల్‌లలో 5 ఎకరాలను, సూర్యాపేటలో 6 ఎకరాలను. రాజన్న సిరిసిల్లలోఓ 9.38ఎకరాలను. ములుగులో 5 ఎకరాలను, కుమరం భీంలో 2.20ఎకరాలను, సిద్దిపేట, జయశంకర్‌ భూపాలపల్లిలో 10 ఎకరాల చొప్పున పెద్దపల్లిలో 7 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారంనాడు సీఎస్‌ సోమేష్‌కుమార్‌ జీవో 52ను జారీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement