Saturday, November 9, 2024

All Set – మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్

హైదరాబాద్‌: వివాదాలు, ఆందోళ‌ల‌ను మ‌ధ్య మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ముందడుగు వేయడమే తప్ప.. వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందే వెయ్యి సార్లు ఆలోచిస్తామని.. తీసుకున్నాక వెనక్కి వెళ్లేది లేదన్నారు.

సచివాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ,. నవంబరు 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు ప్రకటించారు. తొలుత బాపూఘాట్‌ నుంచి పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. నవంబరులో ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకు సిద్ధమన్నారు. త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు.

అభ్యంతరాలు, సూచ‌న‌లు తెల‌పండి…. స్వీక‌రిస్తాం

బిఆర్ ఎస్ నేత‌లు మూసీ పునరుజ్జీవంపై అభ్యంతరాలను తెలియజేయాల‌ని కోరారు.. త‌న‌ను కలవడానికి ఇబ్బంది అయితే మంత్రులు, అధికారులను కలిసి చెప్పొచ్చ‌ని అని అన్నారు రేవంత్ . ముందుగా బాపూఘాట్‌ నుంచి వెనక్కి 21 కి.మీ అభివృద్ధి చేస్తామ‌ని, . మల్లన్న సాగర్‌ నుంచి మూసీకి నీరు తరలిస్తామ‌ని చెప్పారు.

మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి నీటి తరలింపునకు నవంబరులో టెండర్లు పిలుస్తామ‌ని చెప్పారు.. మూసీ అభివృద్ధి అధ్యయనానికి నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను సియోల్‌కు పంపుతామ‌ని తెలిపారు… మూసీ పునరుజ్జీవంపై కావాలనే చర్చకు తెరలేపాన‌ని, . ఈ చర్చ కారణంగా ప్రజలకు అవగాహన కలిగింద‌ని అన్నారు.. మూసీని బాగు చేసేవాడొకడు వచ్చాడని ప్రజలకు తెలిసింద‌ని అంటూ ఈ ప్రాజెక్టు ద్వారా పర్యాటకం అభివృద్ధి చెందుతుందన్నారు.

- Advertisement -

క‌క్ష సాధింపు అనేది ఉండ‌దు..

ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం, విద్యుత్‌ కొనుగోళ్లపై విచారణ జరుగుతోంద‌ని చెప్పారు రేవంత్ . విచారణ సమయంలో కక్ష సాధింపు ఉండద‌ని పేర్కొన్నారు. . దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటామ‌ని అన్నారు.. ఈ విష‌యంలో త‌న‌కు రాజకీయంగా నష్టం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని తెలిపారు. ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న నా కల నెరవేరింద‌ని, ఇక ముఖ్యమంత్రి పదవి కంటే పెద్ద కలలు నాకు వేరే ఏమీ లేవ‌ని చెప్పారు..

కెసిఆర్ అప్పులు పాలు చేసినా..

కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినా.. నేను రుణమాఫీ చేశామ‌ని,. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామ‌ని, . సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామ‌ని వివ‌రించారు రేవంత్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేశామ‌ని చెప్పారు. మూసీ కోసం భూములిచ్చేవారికి వందశాతం సంతృప్తి చెందేలా ప్యాకేజీ ఇస్తామ‌న్నారు. . ప్రజలను కష్టపెట్టి భూములు తీసుకోబోమ‌ని హామీ ఇచ్చారు.

బిఆర్ఎస్ ఎందుకు వ్య‌తిరేకిస్తుంది..

మూసీ ప్రాజెక్టును ఎన్జీవోలు వ్యతిరేకిస్తే అర్థం ఉంద‌ని, పదేళ్లు అధికారంలో ఉన్నబిఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్థం కావట్లేదని రేవంత్ చెప్పుకొచ్చారు.. . కేటీఆర్‌ ప్రపంచస్థాయి మేధావిని అనుకుంటార‌ని అంటూ మూసీని బాగు చేసే అంశంలో కేటీఆర్‌ తన ఆలోచనలు చెప్పొచ్చు అని అన్నారు. అంతర్జాతీయ అవగాహన ఉన్న ఆయనకు మూసీని ఎలా బాగు చేయాలో తెలియదా? ఈ ప్రాజెక్టుపై కేటీఆర్‌ నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నా. కేటీఆర్‌, హరీశ్‌రావు, ఈటల తమ ప్రతిపాదనలు తెలపాలి. నేను ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ని.. గేమ్‌ ప్లాన్‌పై నాకు స్పష్టత ఉంది. 55 కి.మీ మూసీ పునరుజ్జీవం పూర్తయితే అద్భుతనగరం ఆవిష్కృతమవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement