Friday, December 8, 2023

ఎంపీలంతా పదవులకు రాజీనామా చేయండి…మాణిక్ రావు ఠాక్రే

వైరా మార్చి 26 (ప్రభ న్యూస్): దేశంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అంతా తమ పదవులకు రాజీనామా చేసి రాహుల్ గాంధీకి అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యరావు ఠాక్రే పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి వైరాలో పీసీసీ సభ్యులు ధర్మసోత్ రామ్మూర్తి నాయక్, కట్ల రంగారావు అధ్యక్షతన జరిగిన హత్ సే హత్ జోడోయాత్ర బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి వస్తున్న ఆధారణను చూసి ఓర్వలేక పార్లమెంటరీ నుండి సస్పెన్షన్ విధించాలని ఆరోపించారు. దేశంలో జరుగుతున్న పరిణామాలు అన్నిటిని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాహుల్ గాంధీకి బిజెపియేతర పార్టీలన్నీ తమ మద్దతు ప్రకటించి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో జోడోయాత్రలో భాగంగా రాహుల్ గాంధీకి అనూహ్యస్పందన వచ్చిందని, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డికి పాదయాత్ర కు ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి అహర్నిశలు శ్రమించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
   

ఈ కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి గారపాటి రేణుక చౌదరి, జిల్లా అధ్యక్షులు పువ్వుల్లా దుర్గాప్రసాద్, నాయకులు కట్ల రంగారావు, మానుకొండ రాధా కిషోర్, ఎడవల్లి కృష్ణ, లక్కినేని సుదర్శన్, పగడాల మంజుల, మానవతారాయ్, సూరంపల్లి రామారావు, కట్ల సంతోష్, వేణుగోపాల్, కట్ల నాగరాజు, ఐదు మండలాల అధ్యక్షులు, పార్టీ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement